News November 23, 2025
సింగరేణి ట్రేడ్ మెన్ వారసుడే భూపాలపల్లి ఎస్పీ

సింగరేణి కంపెనీలో బెల్లంపల్లి సివిల్ డిపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సిరిశెట్టి సత్యనారాయణ కుమారుడు సంకీర్త్ భూపాలపల్లి నూతన ఎస్పీగా నియమితులయ్యారు. అంతకుముందు మిషన్ భగీరథ ఇంజనీర్‌గా పని చేసిన సంకీర్త్, తన ప్రతిభతో సివిల్స్‌లో 330వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. భూపాలపల్లి ఎస్పీగా రావడంతో సింగరేణి ఏరియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News November 24, 2025
విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి.!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న హోంగార్డు బి.కృష్ణారావు (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ఆయన కాసేపటికే విశాఖలోని 104 ఏరియా రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.
News November 24, 2025
రైలు ప్రమాదంలో బాపట్ల వాసి మృతి

తెనాలి మండలం కొలకలూరు పరిధిలోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం పట్టాలపై డెడ్ బాడీ సోమవారం ఉదయం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి జీఆర్‌పీఎఫ్ చేరుకున్నారు. మృతుడు కొలకలూరులోని అగ్రహారానికి చెందిన దార సుధీర్‌గా(44)గా గ్రామస్థులు గుర్తించారు. బాపట్ల జిల్లా మూల్పూరు నుంచి వచ్చిన సుధీర్ 10 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారని వారు చెప్పారు. దీనిపై కేసు నమోదైంది.
News November 24, 2025
VIRAL: 6 నెలల నిరీక్షణ తర్వాత తల్లి చెంతకు..!

ముంబై రైల్వే స్టేషన్‌లో మే 20న అదృశ్యమైన నాలుగేళ్ల ఆరోహి, ఆరు నెలల అంధకారం తర్వాత తల్లి ఒడికి చేరింది. మే 20న స్టేషన్‌లో తల్లి నుంచి ఆరోహి కిడ్నాప్‌కు గురైంది. వారణాసిలోని అనాథాశ్రమానికి చేరిన ఆ చిన్నారిని, పోలీసులు వేసిన పోస్టర్ల ఆధారంగా ఓ రిపోర్టర్ గుర్తించారు. ముంబైకి తిరిగి వచ్చిన ఆరోహి.. తన తల్లిదండ్రుల కంటే ముందుగా అక్కడున్న పోలీసు అధికారులను కౌగిలించుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.


