News November 23, 2025

భద్రకాళి అమ్మవారికి పూజలు

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.

Similar News

News November 24, 2025

AAIలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 20గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ (B.Com, BA, BSc, BBA), డిప్లొమా ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.12వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు NATS పోర్టల్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: aai.aero.

News November 24, 2025

సాగులో కొత్త ట్రెండ్.. చక్ర వ్యవసాయంతో శివానీ సక్సెస్

image

ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చక్ర వ్యవసాయం(QUICK CYCLE FARMING) ట్రెండ్ నడుస్తోంది. ఈ విధానంలో తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను సాగు చేస్తారు. నిపుణుల సూచనలతో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎన్నుకొని, సరైన యాజమాన్యం, నీటి పారుదల కల్పించి తక్కువ సమయంలో అధిక ఆదాయం పొందుతున్నారు. ఉల్లిపాయలు, పాలకూర, మెంతులు, కొత్తిమీర మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. శివానీ కూడా ఇలాగే కొత్తిమీరతో లాభాలు పొందారు.

News November 24, 2025

ఇతిహాసాలు క్విజ్ – 76

image

ఈరోజు ప్రశ్న: రావణుడు సీతమ్మవారిని అపహరించినా, ఆమెను బలవంతంగా ముట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>