News April 16, 2024

పాలకొండ: 200 ఏళ్ల నాటి రామాలయం

image

పాలకొండ రోడ్డులో ఉన్న కోదండ రామాలయం 200 ఏళ్ల కిందట అళ్వార్లు నిర్మించారు. 1826లో అయోధ్య నుంచి నాటు బండ్లపై సీతారామ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. కోదండ రామాలయంగా ఉన్న ఈ ప్రదేశంలో అద్దమడుగుల వెంకన్న పంతులు పేదవారికి, అనాథల కోసం అన్నసత్రం ఏర్పాటు చేశారని, ఆయన ఆధ్వర్యంలోనే కోదండ రామాలయం నిర్మించినట్టు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు.

Similar News

News April 23, 2025

శ్రీకాకుళం : టెన్త్ రిజల్ట్స్.. 23,219 మంది పాస్

image

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 28,176 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,219 మంది పాసయ్యారు. 14,287 మంది బాలురు రాయగా 11,358 మంది పాసయ్యారు. 13,889 మంది బాలికలు పరీక్ష రాయగా 11,861 మంది పాసయ్యారు. 82.41 పాస్ పర్సంటేజ్ తో శ్రీకాకుళం జిల్లా 14వ స్థానంలో నిలిచింది. గతేడాది రెండో స్థానంలో నిలవగా.. 14వ స్థానానికి పడిపోయింది.

News April 23, 2025

SKLM: ఐఏఎస్‌గా ఎంపికైన యువకుడికి కేంద్రమంత్రి అభినందన

image

ఈ ఏడాది UPSC సివిల్ సర్వీసెస్‌ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా యువకుడు బన్న వెంకటేశ్ ఆల్‌ ఇండియా 15వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయనను ఫోన్‌లో అభినందించారు. వెంకటేశ్ తండ్రితో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకి గర్వకారణంగా ఉందని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలన్నారు.

News April 23, 2025

శ్రీకాకుళం : డైట్ కళాశాలలో పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూలు

image

శ్రీకాకుళం జిల్లాలోని వమరవల్లిలోని డైట్ కళాశాలలో ఎస్ఎస్ టీసీ ప్రాతిపదికన డిప్యుటేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. డైట్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5 సీనియర్ లెక్చలర్లు, 17 లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఆయా అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలన, ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

error: Content is protected !!