News April 16, 2024
‘నిద్ర’ మానవ కనీస అవసరం: బాంబే హైకోర్టు
మనిషికి నిద్ర కనీస అవసరమని, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కులను ఉల్లంఘించినట్టేనని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితుల స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేయడానికి ‘earthly timings’ని పాటించాలని EDని ఆదేశించింది. నిద్ర లేకపోతే మానసిక సమస్యలు వస్తాయని పేర్కొంది. తనను రాత్రి సమయాల్లో ఈడీ అధికారులు విచారించారని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.
Similar News
News November 18, 2024
ఢిల్లీలో తగ్గిన గాలి నాణ్యత.. సీఎం కీలక ఆదేశాలు
ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవడంతో సీఎం ఆతిశీ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్టేజ్-4 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు తప్పా మిగతా వారికి ఫిజికల్ క్లాసులు నిర్వహించవద్దని ట్వీట్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో పాటు నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది.
News November 18, 2024
3 రోజుల్లో రూ.127.64 కోట్ల వసూళ్లు
సూర్య, దిశా పటానీ కాంబినేషన్లో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.127.64 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
News November 18, 2024
డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం: నారాయణ
AP: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కొత్త విధానం రూపొందించామని నెల్లూరులో అధికారులతో సమీక్షలో మంత్రి చెప్పారు. ప్రజలు తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.