News April 16, 2024

ఆర్థిక వ్యవస్థ ఎదిగినా.. భారత్ పేద దేశమే: దువ్వూరి

image

భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. పేద దేశంగానే ఉంటుందని RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. సౌదీ అరేబియా అందుకు సాక్ష్యమన్నారు. అది సంపన్న దేశమే అయినా ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాలేకపోయిందని ఉదహరించారు. దేశంలో సంక్షేమ ఫలాలు అందరికీ అంది, నిరుపేదలన్నవారు లేనిరోజే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని దువ్వూరి తన పుస్తకంలో పేర్కొన్నారు.

Similar News

News November 18, 2024

నిద్రపోకుండా వ్యాయామం చేస్తున్నారా?

image

రోజూ ఉదయమే నిద్రలేచి వ్యాయామం, వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే దీనికోసం ఉదయం 4/5 గంటలకే లేచి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. డా. సుధీర్ కుమార్ రిప్లై ఇచ్చారు. ‘అందరికీ 7-9 గంటలు నిద్ర అవసరం. నిత్యం తక్కువ నిద్రపోయి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదికాదు. వ్యాయామం చేసేముందు వాంఛనీయ నిద్ర ఉండేలా చూసుకోండి’ అని ఆయన సూచించారు. మీరు రోజూ ఎంతసేపు నిద్రపోతారు?

News November 18, 2024

హెజ్బొల్లా కీలక నేత హతం

image

హెజ్బొల్లా మీడియా రిలేషన్స్ చీఫ్‌ మహ్మద్ అఫీఫ్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. బీరుట్‌లో జరిపిన ఐడీఎఫ్ వైమానిక దాడిలో అఫీఫ్ మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోనూ దాడులు చేస్తోంది. ఇవాళ జరిపిన దాడుల్లో 12 మంది పౌరులు మరణించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

News November 17, 2024

రేపు ఢిల్లీకి కేటీఆర్!

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. వికారాబాద్(D) లగచర్ల గిరిజనులతో కలిసి జాతీయ ST కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లగచర్లలో ఫార్మా భూసేకరణపై చర్చించే క్రమంలో కలెక్టర్‌పై పలువురు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.