News April 16, 2024
మదనాపురం: సాగులో సందేహాలకు సంప్రదించండి

సాగులో అన్నదాతలకు ఎదురవుతున్న సమస్యలు, చీడ పీడల నివారణకు చర్యలు, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులపై సందేహాలకు నివృత్తి చేసేందుకు మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అన్నారు. వివరాలకు 94408 35658 సంప్రదించాలన్నారు.
Similar News
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో వాగ్దేవి ప్రభంజనం

ఆరంభం నుంచి అదే సంచలనం ఏటేటా అదే ప్రభంజనం అది వాగ్దేవికే సొంతం అని కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి తెలిపారు. ఇంటర్ ఫలితాలలో MPC- ఫస్టియర్ అమీనా 468 మార్కులు, BiPC ఫస్టియర్లో సంజన 436 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో నవనీత్ గౌడ్ 992, బైపీసీలో రబ్ ష 991 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.
News April 22, 2025
పాలమూరు జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

ఫస్ట్ ఇయర్‌లో స్టేట్..
> MBNRజిల్లా 64.24 శాతంతో 9వ RANK
> GDWL జిల్లా 59.25 శాతంతో 14వ RANK
> WNP జిల్లా 59.17 శాతంతో 16వ RANK
> NRPT జిల్లా 57.87 శాతంతో 19వ RANK
> NGKLజిల్లా 48.77 శాతంతో 32వ RANK
సెకండ్ ఇయర్‌లో
> MBNRజిల్లా 71.35 శాతంతో 10వ RANK
> NRPT జిల్లా 69.54 శాతంతో 14వ RANK
> GDWL జిల్లా 68.34 శాతంతో 20వ RANK
> WNP జిల్లా 66.89 శాతంతో 24వ RANK
> NGKLజిల్లా 63.93 శాతంతో 28వ RANK
News April 22, 2025
Inter Results.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ ఇయర్‌లో 64.24 శాతం మంది పాసయ్యారు. 10,923 మంది పరీక్షలు రాయగా 7,017 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 71.35 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 9,946 మంది పరీక్షలు రాయగా 7,096 మంది ఉత్తీర్ణత సాధించారు.