News November 23, 2025
సిరిసిల్ల: సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త: ఎస్పీ

పుట్టపర్తి సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సాయిరాం జయంతి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిరాం పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు, ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
News November 23, 2025
విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సరైన సీలుతో మరియు ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి. విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు రశీదు తప్పక తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్ సంతకం తప్పక ఉండాలి.
News November 23, 2025
VZM: అక్కడ చురుగ్గా పనులు.. ఇక్కడ మాత్రం..!

ఉమ్మడి విజయనగరం జిల్లాలో బ్రిటిష్ కాలంనాటి వంతెనలు చాలా ఉన్నాయి. వాటిలో సీతానగరం, పారాది, కోటిపాం ప్రధానమైనవి. అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఈ వంతెనలపై నుంచి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే వాహనాల రద్దీ పెరగడంతో వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పారాది, సీతానగరం వద్ద కొత్త వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ కోటిపాం వంతెన పనులకు అడుగులు పడకపోవడం గమనార్హం.


