News November 23, 2025
పుత్తూరు: హత్య చేసిన నిందితుడి అరెస్ట్

పుత్తూరు మండలం గొల్లపల్లి వద్ద ఈనెల 19వ తేదీన హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు తాలూకా కేశవరాజుకుప్పానికి చెందిన రవి(40)ని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యసనాలకు బానిసైనా రవి రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు పరిసర ప్రాంతాలలో చెత్త, కాగితాలు ఏరుతూ ఉండేవాడు. తినడానికి డబ్బు ఇవ్వలేదని తన సంచిలోని కత్తి తీసి రామ్మూర్తిని పొడిచాడు.
Similar News
News November 24, 2025
Next నెల్లూరు మేయర్ ఎవరు..? జరుగుతున్న చర్చ ఇదే

మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే తర్వాత మేయర్ ఎవరనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. స్రవంతి ST సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. అదే జరిగితే 53వ డివిజన్ కార్పొరేటర్ సుజాత, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రకు అవకాశం ఉంటుంది. లేదంటే డిప్యూటీ మేయర్‌కి ఇన్‌ఛార్జ్ మేయర్ బాధ్యతలు ఇచ్చే చాన్స్ కూడా ఉంది.
News November 24, 2025
హుకుంపేటలో యాక్సిడెంట్..ఒకరు మృతి

హుకుంపేటలోని ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..మండలంలోని నూర్పురాయికి చెందిన శ్రీను బైక్‌పై వెళ్తుండగా తాడేపుట్టు పంచాయతీ పరిధి సాయిరాం మందిరం వద్ద అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
HYD: రూ.50 వేలకు 10th సర్టిఫికెట్!

నార్సింగి పోలీసుల దాడిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క టెన్త్ సర్టిఫికెట్‌ను రూ.50,000కి, ఇంటర్‌ను రూ.75,000కి, డిగ్రీ సర్టిఫికేట్‌ను రూ.1.20 లక్షలకు అమ్మడం గమనార్హం.


