News November 23, 2025
హనుమాన్ చాలీసా భావం – 18

యుగ సహస్ర యోజన పర భానూ।
లీల్యో తాహి మధుర ఫల జానూ॥
హనుమంతుడు తన బాల్యదశలో కొన్ని వేల యుగాలు దూరంలో ఉన్న సూర్యుడిని చూసి, దానిని తినదగిన తీయని పండుగా భావించి, దాని వైపు అవలీలగా దూసుకువెళ్లాడు. అపారమైన దూరాన్ని లెక్కచేయక, ప్రపంచాన్ని సృష్టించే శక్తివంతమైన సూర్యుడిని సైతం పండుగా భావించిన ఆ అమాయకత్వం, ధైర్యం మనకు స్ఫూర్తినిస్తాయి. నిష్కళంకమైన భక్తి, అచంచల విశ్వాసంతో ఏదైనా సాధ్యమే. <<-se>>#HANUMANCHALISA<<>>
Similar News
News November 24, 2025
ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News November 24, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 24, 2025
స్మృతి మంధాన కాబోయే భర్తకూ అనారోగ్యం!

మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో నిన్న జరగాల్సిన పెళ్లి <<18368671>>వాయిదా<<>> పడింది. ఆ తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురైనట్లు NDTV తెలిపింది. వైరల్ ఫీవర్‌తో పాటు ఎసిడిటీ పెరగడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. మరోవైపు స్మృతి తండ్రిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు.


