News November 23, 2025

HYD: జంట జలాశయాల ప్రత్యేకత ఇదే!

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది 1908లో భాగ్యనగరాన్ని వరదలతో ముంచెత్తగా.. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు 1920-1926లో మూసీ, ఈసీ నదులపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో వంతెనలు నిర్మించారు. అప్పటి నుంచి నగరానికి తాగునీటి సరఫరా చేయడం ప్రారంభించారు.

Similar News

News November 23, 2025

రేపు ఘంటసాలలో ‘రైతన్నా మీ కోసం’

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ఘంటసాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. టీడీపీ నేతలు ఆదివారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కనపర్తి శ్రీనివాసరావు శాస్త్రవేత్త డా.డి.సుధారాణితో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

News November 23, 2025

ఏలూరు: ఈనెల 25న విభిన్న ప్రతిభావంతుల క్రీడలు

image

వచ్చే నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏడీ రామ్‌కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ వెట్రిసెల్వి హాజరవుతారని, విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

News November 23, 2025

అంతరిక్ష విజ్ఞాన వీచిక.. స్పేస్ ఆన్ వీల్స్: కలెక్టర్

image

విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు, ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్‌ను కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. అంతరిక్ష రంగంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు.