News April 16, 2024
BREAKING: భారీగా పెరిగిన ధరలు

బంగారం ధరలు ఆకాశమే హద్దు అన్నట్లు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.980 పెరిగి రూ.74,130కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,950గా నమోదైంది. అటు సిల్వర్ కూడా కేజీ రూ.1000 పెరిగి రూ.90,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News January 25, 2026
వెనిజులాపై సైనిక దాడి.. 15నిమిషాలే టైమిచ్చారు: డెన్సీ రోడ్రిగ్జ్

వెనిజులాపై అమెరికా సైనిక దాడిలో ఎదురైన సవాళ్ల గురించి తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ సంభాషణ వీడియో లీకైంది. తమ డిమాండ్లను అంగీకరిస్తారా? లేక చస్తారా? అని అమెరికా దళాలు బెదిరించినట్లు అందులో రికార్డైంది. తనతోపాటు ఇంటర్నల్ మినిస్టర్ డియోస్డాడో కాబెల్లో, మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్‌కు 15నిమిషాలు టైమ్ ఇచ్చారన్నారు. మదురో ఆయన భార్యను చంపేసినట్లు యూఎస్ దళాలు ముందుగా తమకు చెప్పాయని తెలిపారు.
News January 25, 2026
Republic day Special : దుర్గాబాయి దేశ్‌ముఖ్

దుర్గాబాయి దేశ్‌ముఖ్ గాంధీజీ పిలుపు మేరకు ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్‌ముఖ్ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. సంఘసంస్కరణ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించారు. 1929లో మహిళా ఉద్ధరణకు మద్రాసులో ‘ఆంధ్ర మహిళా సభ’ను స్థాపించారు. ఈ పేరుతోనే హైదరాబాదులోనూ 1958లో స్థాపించి స్త్రీ జనోద్ధరణకు సహాయకారిగా నిలిచారు.
News January 25, 2026
బంగ్లాలో మరో హిందువును చంపేశారు!

బంగ్లాదేశ్‌లో హిందువుల <<18881711>>హత్యలు<<>> ఆగడం లేదు. తాజాగా నర్సింగడి జిల్లాలో చంద్ర భౌమిక్(23)ను కాల్చి చంపారు. అతను పని చేస్తున్న గ్యారేజీలో నిద్రపోతుండగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో సజీవ దహనమయ్యాడు. ఓ వ్యక్తి దుకాణానికి నిప్పు పెట్టి పారిపోతున్న CC టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చంద్ర తండ్రి గతంలోనే చనిపోగా అనారోగ్యంతో ఉన్న తల్లి, దివ్యాంగుడైన అన్న, మరో సోదరుడి పోషణకు ఇతనే ఆధారంగా ఉన్నాడు.


