News April 16, 2024

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

image

జులై నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. 22న మ.3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 23న మ.3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల టోకెన్లు.. 24న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను TTD విడుదల చేయనుంది.

Similar News

News January 28, 2026

వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో ఉద్యోగాలు

image

<>వాడియా<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, LLB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, అసిస్టెంట్ పోస్టుకు 28ఏళ్లు. స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.wihg.res.in/

News January 28, 2026

చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు

image

మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన అజిత్ పవార్‌కు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ నెరవేరలేదు. ‘సీఎం కావాలనుకుంటున్నాను’ అని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేసినా సీఎం కుర్చీ మాత్రం అజిత్ దాదాకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే మహారాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతగా <<18980541>>రికార్డు<<>> సృష్టించారు.

News January 28, 2026

రొమ్ముల్లో గడ్డలున్నాయా?

image

సాధారణంగా రొమ్ములో ఏవైనా గడ్డలుంటే చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ అని భయపడతారు. కానీ రొమ్ములో కొన్నిసార్లు అపాయంలేని గడ్డలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. దీన్నే ఫైబ్రోఎడినోమా అంటారు. వీటివల్ల ప్రాణాపాయం ఉండదు కానీ రొమ్ములో ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. 15-30 ఏళ్ల మధ్యలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వీటి సైజ్ బాగా ఎక్కువగా ఉంటే ఆపరేషన్‌ చెయ్యాల్సుంటుంది.