News April 16, 2024

CSKకి గుడ్‌న్యూస్

image

IPL ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ నెలకొన్న నేపథ్యంలో CSKకు బంగ్లాదేశ్ శుభవార్త చెప్పింది. CSK కీలక బౌలర్ ముస్తాఫిజుర్ NOCని పొడిగించింది. దీంతో అతడు మే 1న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ వరకు అందుబాటులో ఉండనున్నారు. జింబాబ్వేతో T20 సిరీస్ (మే 3-12) కోసం అతడిని BCB ఏప్రిల్ 30నే స్వదేశానికి రమ్మంది. అయితే CSK కోరిక మేరకు ఆ గడువును తాజాగా పొడిగించింది. CSKలో ఇతడు టాప్ వికెట్ టేకర్(10)గా ఉన్నారు.

Similar News

News February 6, 2026

మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో పోస్టులు

image

మార్ముగావ్ పోర్ట్ అథారిటీ 13 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. . పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, పీజీ, MBA, MSc, BSc, ME/MTech(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), MBBS అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mptgoa.gov.in

News February 6, 2026

థైరాయిడ్ రకాలివే..

image

థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి థైరాయిడ్ గ్రంధి నుంచి హార్మోన్లు అధికంగా ఉత్పత్తైతే హైపర్ థైరాయిడ్, తక్కువగా ఉత్పత్తైతే హైపో థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ స్థాయిని సరిగ్గా నిర్వహించలేకపోతే అది గుండె, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జుట్టు ఎక్కువగా రాలిపోవడం, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉంటే థైరాయిడ్ ఉందని గమనించాలి. ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News February 6, 2026

థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలంటే

image

థైరాయిడ్ టెస్ట్ ఉదయం తొమ్మిది గంటల్లోపు ఖాళీ కడుపుతో చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఏ సమయంలోనైనా పరీక్ష జరిగితే రిపోర్ట్‌ కరెక్ట్‌గా రాదు. రోగులు థైరాయిడ్ పరీక్షల కోసం వచ్చినప్పుడు మందులు తీసుకోకూడదు. రోగులు తమంతట తాముగా మందుల మోతాదు లేదా మొత్తాన్ని తగ్గించుకోకూడదు. అలాగే హైపర్ థైరాయిడిజం మందులను ఎప్పుడైనా తీసుకోవచ్చు. హైపోథైరాయిడిజం మందులు మాత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.