News November 23, 2025
సముద్రంలో దిగి కోనసీమ బాలుడి గల్లంతు

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన తెన్నేటి మహిమరాజు (14) ఆదివారం సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. మలికిపురం ఎస్ఐ సురేష్ వివరాల మేరకు.. బాలుడు ముగ్గురు స్నేహితులతో కలిసి మలికిపురం మండలం చింతలమోరి బీచ్‌లో స్నానానికి దిగాడు. కెరటాలకు సముద్రంలో కొట్టుకు పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి దంపతులు

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని దంపతులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య ఎంగేజ్‌మెంట్ వేడుకకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

CM రేసులో నేనూ ఉన్నా: కర్ణాటక హోం మంత్రి

కర్ణాటకలో సీఎం మార్పు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడిని సీఎం చేయాలని డిమాండ్లు వస్తున్నందున తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఈ విషయంపై AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే ఇప్పటివరకు సీఎం మార్పుపై అధిష్ఠానం చర్చించలేదన్నారు.