News April 16, 2024

ఆర్సీబీ ఇంటికేనా?

image

RCB ఫ్యాన్స్‌కు ఈసారీ నిరాశేనా? వారి కప్పు కల కలగానే మిగలనుందా? అంటే వరుస ఓటములు అవుననే అంటున్నాయి. హైదరాబాద్‌పై ఓటమితో ఆ టీమ్ ప్లే‌ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టంగా (0%) మారాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒకదాంట్లోనే విజయం సాధించింది. ఇక ఆ టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లోనూ తప్పక గెలవాలి. దాంతోపాటు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది.

Similar News

News April 19, 2026

భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మలుపు ‘ఆర్యభట్ట’

image

భారత తొలి కృత్రిమ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను 1975లో ఇదే రోజు రష్యాలోని కాపుస్తిన్ యార్ ప్రయోగకేంద్రం నుంచి ఇస్రో చేపట్టింది. X-RAY ఖగోళ శాస్త్రం, ఏరోనమీ, సోలార్ ఫిజిక్స్‌పై ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ప్రయోగించింది. 5 రోజులపాటు విజయవంతంగా పనిచేసిన ఈ శాటిలైట్ దాదాపు 17yrs తర్వాత భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఆనాడు వేసిన ఈ చిన్న అడుగే నేడు స్పేస్ రంగంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపింది.

News April 19, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ఏరియాను బట్టి రూ.270 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. వరంగల్‌లో రూ.270, కామారెడ్డి రూ.270, ఖమ్మంలో రూ.280కి విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో రూ.230, పల్నాడులో రూ.250-రూ.280, కర్నూలులో రూ.260, నంద్యాలలో రూ.280గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News April 19, 2026

MMTS రైళ్లలో ఫ్రీ జర్నీ.. జూన్ 2 నుంచి అమలు?

image

TG: HYDలో ట్రాఫిక్, పొల్యూషన్‌కు చెక్ పెట్టేందుకు MMTS రైళ్లలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని JUNE 2 నుంచి ఏడాదిపాటు అమలు చేయాలని భావిస్తోంది. ఫలితాన్ని బట్టి ఆ తర్వాత కొనసాగించే ఛాన్సుంది. ఈ మేరకు ద.మ.రైల్వేకు లేఖ రాసింది. MMTS రైళ్ల ద్వారా రైల్వేకి ఏడాదికి సుమారు ₹10Cr ఆదాయం వస్తుండగా, దానిని తామే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం.