News April 16, 2024

BREAKING: వైసీపీ ఎమ్మెల్సీకి జైలుశిక్ష

image

AP:శిరోముండనం కేసులో YCP MLC తోట త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్షతో పాటు ₹2.50లక్షల ఫైన్ విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. కోనసీమ(D) రామచంద్రాపురం(మ) వెంకటాయపాలెంలో 1996 DEC 29న ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం మండపేట నుంచి త్రిమూర్తులు YCP నుంచి పోటీలో ఉన్నారు.

Similar News

News October 13, 2024

‘దసరా’ దర్శకుడితో నాని మరో మూవీ

image

‘దసరా’ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్‌కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

News October 13, 2024

సంజూ శాంసన్ సెల్ఫ్‌లెస్ ప్లేయర్: సూర్య

image

వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘నాకు నిస్వార్ధపరులైన ఆటగాళ్లతో కూడిన జట్టు అంటే ఇష్టం. ఎవరైనా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించి జట్టు ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు. పరుగులు సాధించే క్రమంలో రికార్డులు వాటంతటవే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News October 13, 2024

రతన్ టాటా ఓ ఛాంపియన్: నెతన్యాహు

image

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఛాంపియన్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. ‘నాతోపాటు ఇజ్రాయెల్ ప్రజలందరూ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నాం. ఆయన భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేయండి’ అని ప్రధాని మోదీని ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సంతాపం తెలిపారు.