News November 24, 2025

యథావిధిగా జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

జిల్లావ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గం: నుంచి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా కార్యాలయాలకు రాలేని పక్షంలో https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, 1100 నంబర్‌ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చన్నారు.

Similar News

News November 24, 2025

118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

image

<>NIT <<>>దుర్గాపూర్‌ 118నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc, MCA, M.LSc, M.P.Ed, MBBS, డిగ్రీ, ఇంటర్, ITI, NET, SET, SLET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గ్రూప్-A పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.1500, గ్రూప్ B పోస్టులకు రూ.1000. వెబ్‌సైట్:https://nitdgp.ac.in/

News November 24, 2025

నేడు GWMC కార్యాలయంలో ప్రజావాణి

image

నగర ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు GWMC ప్రధాన కార్యాలయంలో ప్రతీవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం కౌన్సిల్ హాల్‌లో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రకటించారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాజరై తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు.

News November 24, 2025

సంగారెడ్డి డీసీసీ ఎవరికి దక్కేనో..?

image

కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించినప్పటికీ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియామకం పెండింగ్‌లో ఉంచడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ముగ్గురు కీలక నేతలు పోటీలో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్ రెడ్డి నారాయణ, ఖేడ్‌కు చెందిన నగేష్ షెట్కార్, ఖేడ్ MLA సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి డీసీసీ పీఠం పోటీలో ఉన్నట్లు టాక్.