News April 16, 2024

పోలీసుల అదుపులో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం

image

ఆస్ట్రేలియా క్రికెట్‌ మాజీ దిగ్గజం మైకేల్ స్లేటర్‌ను ఆ దేశ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. మాజీ భార్యపై దాడి, వెంబడించడం, అనుమతి లేకుండా ఇంట్లోకి రావడం, హత్యాయత్నం తదితర అభియోగాలను ఆయనపై నమోదు చేశారు. ఇదే తరహాలో మరో 19 అభియోగాలు ఆయనపై గతంలోనూ నమోదయ్యాయి. 2022లో ఓ పోలీసు అధికారిని వెంబడించిన కేసూ స్లేటర్‌పై ఉంది. 1993 నుంచి 2003 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడారు.

Similar News

News January 27, 2026

DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ &డెవలప్‌మెంట్ లాబోరేటరీలో అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఐటీఐ అర్హతగల అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును, డాక్యుమెంంట్స్‌ను కంచన్‌బాగ్‌లోని DRDLకు పోస్ట్ చేయాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News January 27, 2026

కలలో తాళిబొట్టు తెగిపోయినట్లు వస్తే..?

image

స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో తాళి కనిపించడం శుభాశుభ ఫలితాలను సూచిస్తుంది. కలలో తాళిని చూడటం భర్త దీర్ఘాయుష్షుకు, కుటుంబ సౌఖ్యానికి సంకేతం. అయితే అది తెగిపోయినట్లు కలొస్తే అది అశుభంగా భావించాలట. ఇది భర్త ఆరోగ్యం, ఉద్యోగ రీత్యా ఇబ్బందులను సూచిస్తుందట. ఇలాంటి కలలకు భయపడకూడదని శివుడిని పూజించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. దైవారాధనతో ప్రతికూల ప్రభావాలు తొలగి సానుకూలత ఏర్పడుతుందని అంటున్నారు.

News January 27, 2026

బీర, కాకరకాయలను ఎప్పుడు కోస్తే మంచిది?

image

బీరకాయలు రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజులలో కోతకు వస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. కాయలను ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే కోయాలి. కాయలు ముదిరితే పీచు పదార్ధం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి. కాకర పంట నాటిన 60-70 రోజులకు కోతకు వస్తుంది. కాయలను లేతగా ఉన్నప్పుడు, 3-4 రోజుల వ్యవధిలో కోయాలి. దీని వల్ల దిగుబడి పెరిగి మంచి ధర వస్తుంది.