News November 24, 2025
ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 30, 2026
నల్గొండ జిల్లాలో పకడ్బందీగా ఇంటర్ ప్రాక్టికల్స్

నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు రెండు విడతల్లో (ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
News January 30, 2026
నల్గొండ: హస్తం పార్టీలో ‘ఏకపక్ష’ రాజకీయం!

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక చిచ్చు రేపుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నిబంధనలు పక్కనపెట్టి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను సంప్రదించకుండానే అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. మంత్రి ఏకచక్రాధిపత్యంపై జిల్లా నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
News January 30, 2026
NLG: నేడే ఆఖరు తేదీ.. రెండు రోజుల్లో 607 నామినేషన్లు

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బుధవారం కేవలం 44 నామినేషన్లు మాత్రమే రాగా, రెండో రోజైన గురువారం ఏకంగా 563 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండు రోజుల్లో మొత్తం 607 మంది అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. నామినేషన్లకు నేడే ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలతో తరలివచ్చే అవకాశం ఉంది.


