News November 24, 2025
ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 20, 2026
నల్లగొండ ITIలో CNC టెక్నీషియన్ కోర్సు

ఆధునిక సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు నల్లగొండ ప్రభుత్వ ఐటీఐ కళాశాల అద్భుత అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంకేవీవై 4.0లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌లో ‘CNC టర్నింగ్ టెక్నీషియన్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎ.నర్సింహ్మాచారి తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 20, 2026
NLG: ఎన్నికల ఖర్చులో చేతివాటం!

జిల్లాలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఇప్పుడు ఖర్చుల లెక్కలపై చర్చ మొదలైంది. ఎన్నికల నిర్వహణ పేరుతో అయ్యే వ్యయంపై సరైన ఆడిట్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఎన్నికల ఖర్చులను భారీగా పెంచి చూపి, వ్యక్తిగత లాభం పొందిన ఘటనలున్నాయి. ఎన్నికల ఖర్చులపై ఆడిట్ లేకపోవడంతో రూ.లక్షల్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News February 20, 2026
నల్గొండ: మున్సిపాలిటీల్లో ‘కోఆప్షన్’ కోలాహలం

జిల్లాలోని మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గాల ఏర్పాటు ప్రక్రియ ముగియడంతో, రాజకీయ సమీకరణాలు ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల భర్తీ చుట్టూ తిరుగుతున్నాయి. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ పదవులను దక్కించుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, పార్టీ కోసం కష్టపడిన వారు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.


