News November 24, 2025

సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.

Similar News

News November 24, 2025

మంచిర్యాల: దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

image

ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సంబంధిత అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. పాత మంచిర్యాలకు చెందిన లచ్చయ్య వేంపల్లి శివారులోని పట్టా భూమిలో ఇబ్బందికరంగా ఏర్పాటుచేసిన విద్యుత్తు స్తంభాలను మరోచోటికి మార్చాలని కోరారు.

News November 24, 2025

ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

image

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్‌ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News November 24, 2025

పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు ప్రాధాన్యం: ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు సూచించారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 42 మంది ఫిర్యాదుదారుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి, వాటిని సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు.