News April 16, 2024

NLG: భానుడి భగ భగ..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పది గంటలు దాటితే బయటికి రావాలంటే జంకుతున్నారు. రెండు, మూడు రోజులు వడగాలులు వీస్తాయని అవసరమైతే  తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. 

Similar News

News September 11, 2025

నల్గొండ: యాంత్రీకరణ పథకం అమలయ్యేనా..?

image

నల్గొండ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుపై రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం కోసం ప్రభుత్వం రూ.3.17 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు నిధులు ట్రెజరీకి చేరలేదు. దీంతో 1,400 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పనిముట్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉన్నారు. సకాలంలో పనిముట్లు రాకపోతే పథకం ఉద్దేశం నెరవేరదని రైతులు అంటున్నారు.

News September 11, 2025

NLG: స్థానిక ఎన్నికలపై సందిగ్ధం..!

image

స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. ఎన్నికలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో జిల్లాలో ఆయా గ్రామాల్లో ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. ఓ వైపు జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ జడ్పీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంత వరకూ రాలేదు. దీంతో రాజకీయ పార్టీల నేతలు గందరగోళంలో పడ్డారు.

News September 10, 2025

NLG: 15 వరకు ఇగ్నో ప్రవేశాల గడువు

image

IGNOUలో జూలై-2025 సెషన్‌కు సంబంధించిన ప్రవేశాలకు చివరితేదీ ఈ నెల 15 వరకు ఉందని ఇగ్నో HYD ప్రాంతీయ కేంద్రం డీడీ డా.రాజు బొల్లా తెలిపారు. మాస్టర్, డిగ్రీ, పీజీడిప్లొమా, డిప్లొమా వంటి వివిధ ప్రోగ్రాములకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.