News April 16, 2024

అందుకే మద్యపానం నిషేధించలేకపోయాం: అంబటి

image

AP: రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయకపోవడంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తాము ఇచ్చిన హామీల్లో 98%కి పైగా అమలు చేశామని, చేయలేకపోయిన 2% హామీల్లో మద్యపాన నిషేధం ఒకటని చెప్పారు. ఒకేసారి నిషేధం విధిస్తే పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలివస్తోందనే భావనతో అమలు చేయలేకపోయామని వివరించారు. ఇప్పటికీ మద్యపాన నిషేధం చేయాలనే ఉద్దేశం ఉందన్నారు.

Similar News

News January 26, 2026

NTR: డ్రగ్స్ నిర్మూలనకై మహిళా కానిస్టేబుళ్ల సైకిల్ యాత్ర.!

image

పట్టణాల నుంచి పల్లెల వరకు డ్రగ్స్ మహమ్మారి గురించి తెలియజేస్తూ.. నిర్ములనే లక్ష్యంగా NTR జిల్లాకు చెందిన 5 గురు మహిళా పోలీసులు సైకిల్‌పై జిల్లాలోని అన్ని మేజర్ గ్రామాలు తిరిగి అవగాహన కల్పించనున్నారు. JAN 27 నుంచి MAR-1 తేదీ వరకు డ్రగ్స్‌పై దండయాత్ర ”పెడల్ అగైనెస్ట్ డ్రగ్ పెడ్లింగ్” నినాదంతో 510 KM వీరు సైకిల్‌పై వెళ్లి అవగాహనతో పాటు డ్రగ్స్ నిర్ములనే లక్ష్యంగా యాత్ర చేపట్టనున్నారు.

News January 26, 2026

తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

image

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News January 26, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

<>కొచ్చిన్<<>> పోర్ట్ అథారిటీ 7 మెరైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/మ్యాథ్స్), బీటెక్(మెరైన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35-40ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.cochinport.gov.in