News November 24, 2025
హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హతం: IDF

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హయతం అలీ తబతబాయిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. బీరూట్‌లో జరిపిన దాడుల్లో అతడు మరణించినట్లు పేర్కొంది. 1980లో హెజ్బొల్లాలో చేరిన తబతబాయి సిరియా ఆపరేషన్స్‌కు హెడ్‌గా, రాడ్వన్ ఫోర్స్‌కు కమాండర్‌గా పనిచేశాడని తెలిపింది. హెజ్బొల్లా గ్రూప్‌లో ఇతడు నంబర్ 2 లీడర్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.
Similar News
News November 24, 2025
బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్‌గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<


