News November 24, 2025

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో భక్తుల ఆగ్రహం!

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో కొలువై ఉన్న వల్లభ గణేశుడి ఆలయాన్ని సమయానికి తెరవకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలు దాటినా ఆలయం తలుపులు తెరుచుకోకపోవడంతో, గణేశుడిని దర్శించుకోవడానికి చేరుకున్న భక్తులు అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రతి రోజూ నిర్దిష్ట సమయానికి పూజలు ప్రారంభమవుతుండగా, ఈరోజు ఆలస్యానికి స్పష్టమైన కారణం తెలియకపోవడంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది.

Similar News

News November 25, 2025

PDPL: భవన కార్మిక సంక్షేమంపై జేఏసీ ఆందోళన

image

PDPLలో భవన నిర్మాణ కార్మిక సంఘాల JAC ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సీఎస్సీ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, జీవో 12 సవరించి సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కాకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు నిధులను అక్రమంగా బీమా కంపెనీలకు బదిలీ చేశారంటూ నేతలు తీవ్రంగా స్పందించారు. 13లక్షల రెన్యువల్ కాని కార్మికుల కార్డులను వెంటనే పునరుద్ధరించాన్నారు.

News November 25, 2025

వరంగల్: అడ్డాలు తెచ్చిన తంటా..!

image

అదృష్టం వరించిందని సంతోషపడాలో, అడ్డా దొరకలేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో మద్యం షాపుల ఓనర్లు ఉన్నారు. వరంగల్‌లో లిక్కర్ మార్ట్‌లను దక్కించుకున్న కొత్త వాళ్లకు, పాత షాపుల ఓనర్లు చుక్కలు చూపిస్తున్నారట. HNKలో లిక్కర్ వ్యాపారి తనకు వాటా ఇస్తేనే ఇంటి ఓనర్ నుంచి షాపు రెంట్‌కు ఇప్పిస్తా అనడంతో చేసేదేంలేక తనకు వచ్చిన 2 కొత్త షాపుల్లో వాటా ఇచ్చారట. అన్ని చోట్ల కొత్తవాళ్లకు ఇలా సవాలు ఎదురవుతోంది.

News November 25, 2025

జగిత్యాల: మాతా, శిశు సంరక్షణపై ‘సంకల్ప్’ శిక్షణ

image

జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాతా–శిశు సంరక్షణ, నవజాత శిశువుల సంరక్షణపై సంకల్ప్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి డా. ప్రమోద్ కుమార్, జీహెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, గైనక్ హెచ్ఓడీ డా. అరుణ, పిల్లల నిపుణుడు డా. సాయి కిరణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటును 24 నుంచి 10 లోపు తగ్గించేందుకు ఆశా వర్కర్ల ద్వారా అవగాహన పెంపు అవసరమన్నారు.