News April 16, 2024
రేపు మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం

శ్రీరామ నవమి సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 2, 2026
ఇండియా గేట్ ఫొటో షేర్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లక్ష్యంగా ఆసక్తికర పోస్టు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇది అందమైన విజయోత్సవ తోరణం. USలో ఇంతకంటే గొప్ప కట్టడం నిర్మిస్తాం’ అని రాసుకొచ్చారు. అలాగే న్యూస్ మేకర్స్ ఆఫ్-2025 పేరుతో ‘ఇండియా టుడే’ రిలీజ్ చేసిన మ్యాగజైన్ కవర్ పేజీ పోస్టర్‌నూ షేర్ చేశారు. INDతో ట్రేడ్ డీల్ సానుకూలంగా జరుగుతోందన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు.
News February 2, 2026
జాబ్ క్యాలెండర్: ఖాళీ పోస్టులపై కసరత్తు

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి, దాని ప్రకారం పోస్టులు భర్తీ చేయడానికి GOVT శాఖల వారీ ఖాళీలపై కసరత్తు చేపట్టింది. రెవెన్యూలో 13,000, విద్యలో 7,000, వర్సిటీల్లో 3000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. PRలో 26,000, మున్సిపల్‌లో 26,800, అగ్రికల్చర్‌లో 3,000, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 4,200 ఖాళీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర శాఖల వివరాలూ తెప్పిస్తున్నారు. కాగా 90,000 వరకు ఖాళీలుండొచ్చని అంచనా.
News February 2, 2026
ఎర్రజెండా.. ప్రజల గళం: CM రేవంత్ ‘రెడ్’ మార్క్ పాలిటిక్స్!

TG: ప్రజల పక్షాన నిలిచి వాళ్ల గళం వినిపించే పార్టీ ఎర్రజెండా అని CM రేవంత్ రెడ్డి కొనియాడారు. కనీస వేతన చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి కమ్యూనిస్టుల ఎన్నో డిమాండ్లను కాంగ్రెస్ పరిష్కరించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకే నాణేనికి రెండు వైపులా ఉండే పార్టీల్లా ప్రజలు భావిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ CPIతో దూరం పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.


