News November 24, 2025
నరసరావుపేట: నేతన్నలకు అమలు కానీ ఉచిత విద్యుత్.!

చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు ఆగస్టు 7న హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పథకం అమలు కాలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో కేవలం 280 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి గ్రామాలలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News November 24, 2025
కడప: గల్లంతైన ఇద్దరు యువకులు మృతి

కడప శివారులోని వాటర్ గండి పెన్నా నదిలో ఆదివారం ముగ్గురు <<18370606>>గల్లంతైన <<>>విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు చనిపోయారు. కడపకు చెందిన ఐదుగురు స్నేహితులు రీల్స్ కోసం అక్కడికి వెళ్లారు. ఈక్రమంలో ముగ్గురు నీటిలో కొట్టుకెళ్లారు. ఒకరిని అక్కడి వాళ్లు కాపాడారు. కె.నరేష్(18), పి.రోహిత్ కుమార్(16) సుడిగుండాల్లో చిక్కుకుని గల్లంతు అయ్యారు. ఇవాళ ఉదయం ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు.
News November 24, 2025
మహిళా సంఘాల విజయ గాథలు ‘అవని’: కలెక్టర్

మెప్మా మహిళా సంఘాలు సాధించిన విజయగాధలు ‘అవని’ సంచికలో మనమందరం చదవి స్ఫూర్తి పొందవచ్చని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెప్మా వార్షిక సంచిక ‘అవని’ కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళ పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. మెప్మా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, కొత్త అవకాశాలను చూపిస్తూ ముందుకు సాగాలన్నారు.
News November 24, 2025
సీఎం చదువుకున్న పాఠశాల, కళాశాల అభివృద్ధికి రూ.50 కోట్లు: ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల, కళాశాలను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్లతో నూతన భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మించబోయే కొత్త ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వనపర్తిలో ఉన్న చారిత్రక రాజభవనం నిర్మాణ శైలిని పోలి ఉంటుందన్నారు. రాబోయే సంవత్సరకాలంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.


