News November 24, 2025

సచివాలయంలో బ్లాక్ షీప్స్..

image

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం కొందరు సీనియర్ ఐఏఎస్‌లు BRSకు ముఖ్య సమాచారం లీక్ చేస్తున్నారనే ఆరోపణలు. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలు, డ్రాఫ్ట్ దశలోని రిపోర్టుల్లోని కీలక అంశాలను పాత ప్రభుత్వ ముఖ్య నేతలకు చేరవేస్తున్నారట. దీంతో ఆ బ్లాక్ షీప్స్ ఎవరో తెలుసుకునే పనిలో ఇంటలిజెన్స్ ఉందని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.

Similar News

News November 25, 2025

విశాఖ: కూచిపూడి గురువు పొట్నూరు శంకర్ కన్నుమూత

image

ప్రఖ్యాత కూచిపూడి రెండో తరం గురువు ‘కళారత్న’ పొట్నూరు విజయ భరణి శంకర్‌ (90) సోమవారం విశాఖలోని ఎండాడలో కన్నుమూశారు. వెంపటి పెద్ద సత్యం వద్ద శిక్షణ పొంది, 1982లో అకాడమీ స్థాపించి వందలాది మంది నర్తకులను ఆయన తీర్చిదిద్దారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ, నాట్యకళా ప్రపూర్ణ వంటి పురస్కారాలు అందుకున్న ఆయన 6 దశాబ్దాలుగా కళారంగానికి సేవలు అందించారు. ఆయన మృతిపట్ల కళాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు

News November 25, 2025

4th Day స్టంప్స్.. కష్టాల్లో టీమ్ ఇండియా

image

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. జైస్వాల్, రాహుల్ ఔటయ్యారు. సాయి సుదర్శన్, కుల్దీప్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి చివరి రోజు మరో 522 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 25, 2025

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

గువాహటిలోని <>కాటన్ యూనివర్సిటీ<<>> 3 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, MCA, PGDCA/DCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.cottonuniversity.ac.in