News November 24, 2025
ఫిలింఫేర్ అవార్డుపై ధర్మేంద్రకు అసంతృప్తి

నటనలో శిక్షణ తీసుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అయినా ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు లభించలేదనే అసంతృప్తి ఉండేదని పలుమార్లు చెప్పేవారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఆనందాన్నిచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పుకున్నారు. ‘గరమ్ ధరమ్ దాబా’, ‘హీ మ్యాన్’ బ్రాండ్లతో రెస్టారెంట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు.
Similar News
News November 24, 2025
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిశాస్త్రి ఫైర్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఫైరయ్యారు. రెండో టెస్టులో సుందర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం సరికాదన్నారు. ఈ ఆలోచన అర్థం లేనిదని మండిపడ్డారు. కోల్‌కతా(తొలి) టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించి, వారిలో ఒకరికి ఒకే ఓవర్ ఇవ్వడమూ సరైన నిర్ణయం కాదన్నారు. కనీసం స్పెషలిస్టు బ్యాటర్‌తో వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
News November 24, 2025
అద్దె ఇంట్లో ఏ దిశన పడుకోవాలి?

సొంత ఇల్లు/అద్దె ఇల్లు.. అది ఏదైనా ఆరోగ్యం కోసం తల దక్షిణ దిశకు, పాదాలు ఉత్తర దిశకు పెట్టి నిద్రించడం ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘ఈ దిశలో నిద్రించడం అయస్కాంత క్షేత్రాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దక్షిణ దిశలో నిద్రించడం సదా ఆరోగ్యకరమైన అలవాటు. తూర్పు దిశలో తలపెట్టి పడుకోవడం కూడా ఉత్తమమే’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 24, 2025
అండర్ వరల్డ్ మాఫియాకు బెదరని ధర్మేంద్ర

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ 1980, 90ల్లో అండర్ వరల్డ్ మాఫియా బెదిరింపులను విపరీతంగా ఎదుర్కొంది. భయంతో కొందరు నటులు సినిమాలను నిలిపివేయగా, మరికొందరు వారికి డబ్బులు ఇచ్చేవారు. అయితే <<18377596>>ధర్మేంద్ర<<>> మాత్రం వారికెప్పుడూ తలొగ్గలేదని డైరెక్టర్ సత్యజీత్ పూరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎవరైనా ఆయనను బెదిరింపులకు గురిచేస్తే పంజాబ్ నుంచి గ్రామస్థులు ట్రక్కుల్లో వస్తారని తిరిగి వార్నింగ్ ఇచ్చేవాడని గుర్తుచేశారు.


