News November 24, 2025

నల్గొండ: మహిళా ఓట్ల కోసం వ్యూహం..!

image

అధికార కాంగ్రెస్ గ్రామ పంచాయతీల్లో ఓట్లు రాబట్టేందుకు మహిళలపై ఫోకస్ చేసింది. చాలా వేగంగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. NLG జిల్లాలో 29,754 గ్రూపుల్లో, 2,97,054 సభ్యులు, SRPT జిల్లాలో 17,611 గ్రూపుల్లో 1,91,576 సభ్యులు, BNG జిల్లాలో 39,871 గ్రూపులకు 1,59,482 సభ్యులకు చీరలు పంపిణీ చేస్తున్నారు. వీరితో పాటుగా రేషన్ కార్డున్న వారికి సైతం అందించి ఓట్లను సంపాదించాలని ఆలోచనలో ఉన్నారు.

Similar News

News November 25, 2025

UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

image

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్‌గా మారింది.

News November 25, 2025

వెట్లాండ్ రక్షణ బాధ్యత మనదే: సిద్దిపేట కలెక్టర్

image

సిద్దిపేట జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధ్యకతన సోమవారం నిర్వహించారు. సుప్రీంకోర్టు దేశం మొత్తంలో ఉన్న వెట్ ల్యాండ్ సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల జారీ చేసిందని దీనికి సంబంధించి జిల్లాలో 8చెరువులు ఎంపిక చేసినట్లు ఆ చెరువుల మొత్తం విస్తీర్ణం డిజిటల్ మ్యాపింగ్, లోతు, వర్షపాతం, చేపల సామర్ధ్యం, లాంటి విషయాలు సేకరించాలన్నారు

News November 25, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

image

NLG: మహిళా ఓట్ల కోసం వ్యూహం
NLG: కోమటిరెడ్డికి భట్టి విక్రమార్క ఆహ్వానం
NLG: ఏర్పాట్లు వేగవంతం.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
NLG: ఉత్కంఠకు తెర.. రిజర్వేషన్లు ఖరారు
NLG: సర్కార్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం
నకిరేకల్: జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు
నార్కట్ పల్లి: ఎంజీయూ రిఫ్రిజిరేటర్‌లో కప్ప.. ఏబీవీపీ ధర్నా
NLG: టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఇదీ పరిస్థితి