News November 24, 2025
త్వరలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ?(2/2)

సింహాచలం దేవస్థానంలో అనువంశిక ధర్మకర్తను ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పూసపాటి వంశస్థులనే నియమిస్తూ వస్తున్నారు. ఇంతకుముందు చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు ఇటీవల గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. గవర్నర్‌గా చేసే వారు ఇతర స్థానాల్లో కీలక బాధ్యతల్లో ఉండరాదనే నిబంధనలు వల్ల ఆయన చైర్మన్‌గా కొనసాగడంపై తర్జనబర్జనలు జరిగాయి. కొత్త బోర్డు నియామకాం ద్వారా ఈ అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Similar News
News November 24, 2025
NRPT: ప్రేమ విఫలం.. యువకుడు SUICIDE

ప్రేమించిన అమ్మాయి దక్కట్లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాగనూరు (M) కొత్తపల్లిలో జరిగింది. SI అశోక్ బాబు వివరాలు.. కొత్తపల్లికి చెందిన శంకర్(19), బంధువుల అమ్మాయిని కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తుండటంతో తనకు అమ్మాయి దక్కదని ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని అన్న మహేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
News November 24, 2025
లింగ సమానత్వానికి కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 –మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్‌చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.


