News November 24, 2025
HYD: సర్కార్ దవాఖానాలకు ‘మందుల’ సుస్తి

నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
Similar News
News November 24, 2025
సిరిసిల్ల: కార్మికుల భీమ పెంపు పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్లలోని కలెక్టరేట్లో సిరిసిల్ల ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల భీమా పెంపు పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కార్మిక శాఖ అధికారి నజీర్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాదాబాయి, డిఆర్డిఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
News November 24, 2025
ఢిల్లీ కాలుష్యం: సగం మందే ఆఫీసులకు

గాలి కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను 50% మందితోనే నిర్వహించాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చింది. GRAP-3లో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించాలన్న ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వొద్దని ఇప్పటికే ఆంక్షలు విధించింది.
News November 24, 2025
సొసైటీల ద్వారా రైతులకు మెరుగైన సేవలు: కలెక్టర్

MHBD జిల్లాలో PACS ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. దంతాలపల్లి, పెద్ద వంగర, కంబాలపల్లి, అప్పారాజుపల్లి, గంగారంలో కొత్త సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీటిలో రాష్ట్రస్థాయి కమిటీ మూడు సొసైటీలకు ఆమోదం తెలిపిందని, మిగిలిన వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.


