News November 24, 2025
మధిర: లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

లంచం తీసుకుంటూ మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) కె.చందర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చనిపోయిన భవన కార్మికుడి పేరిట వచ్చే రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి అధికారి చందర్, మృతుడి భార్యను రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం రోడ్డులో వల పన్ని, లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
Similar News
News November 24, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 52అర్జీలు

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
News November 24, 2025
నేరుగా రైతుల నుంచే కొనండి.. హోటళ్లకు కేంద్రం సూచన

వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల ఉత్పత్తి సంస్థల (FPO) నుంచే కొనాలని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. సప్లై చైన్ నుంచి మధ్యవర్తులను నిర్మూలించడం ద్వారా రైతుల రాబడిని పెంచవచ్చని చెప్పింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) ట్యాగ్ ఉన్న ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సూచించింది. దేశంలో 35వేల FPOలు ఉన్నాయని, వాటిలో 10వేల వరకు ప్రభుత్వం స్థాపించిందని తెలిపింది.
News November 24, 2025
మంచిర్యాల: మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి

మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వడ్డీ లేని రుణ పథకంలో భాగంగా రూ.304 కోట్లు విడుదల చేశామన్నారు.


