News April 16, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. ముగ్గురు పోలీసులకూ గాయాలైనట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కాంకేర్ జిల్లా పోలీసులు వెల్లడించారు.

Similar News

News January 29, 2026

కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్: మంత్రి సవిత

image

AP: తిరుమల వేంకన్న ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేయించారని మంత్రి సవిత మండిపడ్డారు. పామాయిల్, ఇతర కెమికల్స్‌తో లడ్డూ కల్తీ జరిగిందని, నెయ్యి లేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. జంతుకొవ్వు లేదు కదా అని చేసిన తప్పు కప్పిపుచ్చుకోడానికి YCP బ్యాచ్ బుకాయిస్తోందని ఫైరయ్యారు. కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్ అని, కల్తీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

News January 29, 2026

మేడిగడ్డ బ్యారేజీకి కేంద్రం రెడ్ అలర్ట్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ తీవ్ర ముప్పులో ఉందని కేంద్రం తేల్చింది. ఈ మేరకు దాన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ-1లో చేర్చింది. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ లోక్‌సభకు తెలిపింది. లోపాలను తక్షణమే సరిచేసి బ్యారేజీని పటిష్టం చేయాలని NDSA సిఫార్సు చేసిందని పేర్కొంది. మన్నిక పెరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. ఖజూరి (UP), బొకారో (ఝార్ఖండ్) ఇదే కేటగిరీలో ఉన్నాయి.

News January 29, 2026

పోలీసులకు తప్పనిసరి సెలవులు.. KA డీజీపీ నిర్ణయంపై ప్రశంసలు!

image

పోలీసు ఉద్యోగమంటేనే గడియారంతో సంబంధం లేని విధి నిర్వహణ. అలాంటి చోట ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ అనే మాటే వినిపించదు. కానీ కర్ణాటక DGP సలీం తీసుకున్న నిర్ణయం ఈ ధోరణిని మారుస్తోంది. పోలీసులు తమ బర్త్ డే, పెళ్లి రోజున సెలవు తీసుకోవచ్చనే నిబంధనను తీసుకొచ్చారు. దీంతో పోలీసుల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరంతరం శ్రమించే పోలీసుల సంక్షేమం కోసం డీజీపీ ఆలోచించిన తీరు అద్భుతమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.