News November 24, 2025

గోపాలపురం: హామీ నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి

image

గోపాలపురం నియోజకవర్గం ఐ.ఎస్.జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపు పత్రాలను ఆలయ అధికారులకు అందించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Similar News

News November 25, 2025

ఈనెల 26న జిల్లా అధికారుల సమీక్ష: కలెక్టర్

image

జిల్లా సమీక్షా సమావేశాన్ని ఈనెల 26న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహ నిర్మాణం, 22A కేసులు, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ తదితర అంశాలపై సమీక్షిస్తారన్నారు. జిల్లాకు సంబంధించిన నాయకులు, ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు.

News November 25, 2025

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్: సుందర్

image

గువాహటి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమేనని భారత ఆల్‌రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్‌లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్‌కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్‌లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.

News November 25, 2025

మంచి జరగబోతోంది: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్‌లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.