News November 24, 2025
వరంగల్: నిత్య పెళ్లికూతురుపై కేసు నమోదు..!

నిత్య పెళ్లికూతురుపై <<18370111>>కేసు నమోదు<<>> చేసినట్లు వరంగల్(D) పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు. చౌటపల్లికి చెందిన దేవేందర్ రావు పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపల్లి అరుణ-రామారావులను సంప్రదించారు. దీంతో వారు నిమిషకవి ఇందిర అనే మహిళను చూపించగా వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెకు ఇంతకుముందే వివాహమై కూతురు ఉన్నవిషయం తెలుసుకొని ఫిర్యాదు చేయడంతో ఇందిర, తల్లి లక్ష్మి, అరుణ, రామారావుపై కేసు నమోదు చేశారు.
Similar News
News November 24, 2025
సిరిసిల్ల: కార్మికులకు అవగాహన సదస్సు

ఈనెల 24 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు సిరిసిల్లలో భవన, ఇతర రంగాల నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు సిరిసిల్ల కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పెద్ద ఎత్తున ఈ సదస్సుకు కార్మికులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 24, 2025
సిరిసిల్ల: కార్మికుల భీమ పెంపు పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్లలోని కలెక్టరేట్లో సిరిసిల్ల ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల భీమా పెంపు పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కార్మిక శాఖ అధికారి నజీర్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాదాబాయి, డిఆర్డిఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
News November 24, 2025
ఢిల్లీ కాలుష్యం: సగం మందే ఆఫీసులకు

గాలి కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను 50% మందితోనే నిర్వహించాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చింది. GRAP-3లో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించాలన్న ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వొద్దని ఇప్పటికే ఆంక్షలు విధించింది.


