News November 24, 2025

మల్యాల: ‘రెండోసారి అధికారంలోకి వచ్చాక మహిళలందరికీ పట్టుచీరలు’

image

రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలందరికీ పట్టుచీరలు అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఇవాళ సాయంత్రం మల్యాలలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్ప చేసిందని ఆరోపించారు.

Similar News

News November 25, 2025

విశాఖ: కూచిపూడి గురువు పొట్నూరు శంకర్ కన్నుమూత

image

ప్రఖ్యాత కూచిపూడి రెండో తరం గురువు ‘కళారత్న’ పొట్నూరు విజయ భరణి శంకర్‌ (90) సోమవారం విశాఖలోని ఎండాడలో కన్నుమూశారు. వెంపటి పెద్ద సత్యం వద్ద శిక్షణ పొంది, 1982లో అకాడమీ స్థాపించి వందలాది మంది నర్తకులను ఆయన తీర్చిదిద్దారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ, నాట్యకళా ప్రపూర్ణ వంటి పురస్కారాలు అందుకున్న ఆయన 6 దశాబ్దాలుగా కళారంగానికి సేవలు అందించారు. ఆయన మృతిపట్ల కళాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు

News November 25, 2025

4th Day స్టంప్స్.. కష్టాల్లో టీమ్ ఇండియా

image

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. జైస్వాల్, రాహుల్ ఔటయ్యారు. సాయి సుదర్శన్, కుల్దీప్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి చివరి రోజు మరో 522 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 25, 2025

అల్లూరి: ఓటర్ల మ్యాపింగ్‌పై కలెక్టర్ సమీక్ష

image

2002 నాటి ఓటర్ల మ్యాపింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 లక్ష్యం, 2002లో 35 ఏళ్లు పైబడిన ఎలక్టార్స్ 2025లో ఉంటే వారి మ్యాపింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో
మంగళవారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల EROలు, MROలు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు.