News November 24, 2025

కామారెడ్డి జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీ

image

పరిపాలనా కారణాల దృష్ట్యా కామారెడ్డి జిల్లాలోని నలుగురు SIలను వేరే పోలీస్ స్టేషన్‌లకు అటాచ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం మెమోరాండం జారీ చేసింది. కె.విజయ్‌ను మద్నూర్ నుంచి బిబిపేట్‌కు, ఎం.ప్రభాకర్‌ను బిబిపేట్ నుంచి దోమకొండకు, డి.స్రవంతిని దోమకొండ నుంచి కామారెడ్డి టౌన్‌కు జి.రాజును (వెయిటింగ్ రిజర్వ్) నుంచి మద్నూర్ పీఎస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Similar News

News November 25, 2025

అనంత: ఆ నిందితులకు 14 రోజుల రిమాండ్

image

అనంతపురం సాయి నగర్ 3rd క్రాస్‌లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు మొత్తం ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించామన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు ఒక మోటార్ సైకిల్ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

News November 25, 2025

నవంబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1926: 21వ సీజేఐ రంగనాథ్ మిశ్రా జననం
1964: వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం
1968: సినీ దర్శకుడు ముప్పలనేని శివ జననం
1972: సినీ నటి సుకన్య జననం
2010: ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు మరణం(ఫొటోలో)
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మరణం
* అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం

News November 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.