News April 16, 2024

సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లిన సీఎం

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వెళ్లారు. కాల్పుల ఘటన నేపథ్యంలో సల్మాన్‌ను ఆయన కలిశారు. భద్రతా ఏర్పాట్లపై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. కాగా ఇటీవల సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ ఎదుట దుండగులు తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.

News April 18, 2026

హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

image

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.

News April 18, 2026

GOOD NEWS: చిన్నారి పునర్వికకు పునర్జన్మ

image

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలు నిలిచాయి. <<19232308>>దాతల<<>> ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను ఇవాళ అందించారు. ‘ఇచ్చిన <<19240414>>మాట<<>> నిలబెట్టుకున్నాం. చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు’ అని పునర్వికతో ఉన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.