News November 24, 2025
పెద్దపల్లి: ప్రజావాణిలో ఆర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్న ఆయన, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు సమర్పించారు.
Similar News
News November 25, 2025
జనగామ: ముక్కిపోతున్న దొడ్డు బియ్యం!

జిల్లాలోని ఆయా రేషన్ డీలర్ల షాపులలో పాత స్టాక్ (దొడ్డు బియ్యం) ముక్కిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో మిగిలిపోయిన పాత స్టాక్ మొత్తం పురుగులు పట్టి పాడవుతున్నాయని, ఇప్పటికే 70% మేర బియ్యం పాడైపోయాయని ఆయా షాపుల రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోని బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
కోటంరెడ్డి సోదరుడి కుమార్తె సంగీత్‌లో భారత క్రికెటర్

టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డికి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు రాహుల్ సిప్లిగంజ్ టీం ఇండియా స్పిన్నర్ చాహల్‌ను ఆహ్వానించారు. దీంతో ‘‘నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ హరిణ్య పోస్టు చేశారు.
News November 25, 2025
సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్‌ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్‌ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.


