News November 25, 2025
హుస్నాబాద్: కుక్క కాటుకు మందు లేకపోతే ఎట్లా కేంద్రమంత్రి సారు.!

హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కకాటుకు మందు లేని దుస్థితి నెలకొందని రోగులు విన్నపించుకున్నారు. ఆసుపత్రికి వచ్చేది పేద ప్రజలమేనని, కానీ సూది, మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పేదల పరిస్థితి ఏంటి? చావాల్సిందేనా? అని ప్రశ్నించారు. ఇకపై ఇక్కడి రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి రానివ్వద్దని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 25, 2025
వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్‌లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్‌లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
వరంగల్: 113 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 113 కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
ట్రాఫిక్ పరిధి: 54
వెస్ట్ జోన్ పరిధి: 23
ఈస్ట్ జోన్ పరిధి: 18
సెంట్రల్ జోన్ పరిధి: 18
News November 25, 2025
మాట మార్చిన కడియం..!

స్టే.ఘనపూర్ MLA కడియం శ్రీహరి రోజుకో ట్విస్టు ఇస్తున్నారు. ఒకసారి తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. BRS నుంచి గెలిచిన కడియం, అనూహ్యంగా MP ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్‌కు అనుబంధంగా కొనసాగుతున్నారు.అయితే స్పీకర్‌ను కలిసిన అనంతరం కడియం వైఖరిలో మార్పు వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్దమంటూ కుండబద్దలు కొట్టిన కడియం, ఇప్పుడు రాజీనామా చేసేదీ లేదని చెప్పడం వెనుక మర్మమేంటో కామెంట్ చేయండి.


