News November 25, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

image

NLG: మహిళా ఓట్ల కోసం వ్యూహం
NLG: కోమటిరెడ్డికి భట్టి విక్రమార్క ఆహ్వానం
NLG: ఏర్పాట్లు వేగవంతం.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
NLG: ఉత్కంఠకు తెర.. రిజర్వేషన్లు ఖరారు
NLG: సర్కార్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం
నకిరేకల్: జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు
నార్కట్ పల్లి: ఎంజీయూ రిఫ్రిజిరేటర్‌లో కప్ప.. ఏబీవీపీ ధర్నా
NLG: టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఇదీ పరిస్థితి

Similar News

News February 16, 2026

చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రంలో ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలవనరులు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కబ్జాలకు తావులేకుండా నిఘా పెంచాలని స్పష్టం చేశారు.

News February 16, 2026

సమష్టి కృషితో జిల్లా ప్రగతి: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి 82 వినతులను స్వీకరించారు. కోర్టు కేసులు, కమిషన్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించారు. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

News February 16, 2026

నల్గొండ: బందోబస్తు పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్రపవార్

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 6 మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.