News November 25, 2025
జగిత్యాల కార్ ఓనర్స్ & డ్రైవర్స్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేష్

జగిత్యాల జిల్లా కేంద్రంలో కారు ఓనర్స్ & డ్రైవర్స్ జిల్లా సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సురుగు వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా దాది రఘుపతి, కార్యదర్శిగా దండే రమేష్, అదనపు కార్యదర్శిగా మాలి కిషన్, కోశాధికారిగా మధురవేణి మహేష్, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెంకటేష్ మాట్లాడుతూ.. డ్రైవర్ల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు.
Similar News
News November 25, 2025
వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్‌లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్‌లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
వరంగల్: 113 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 113 కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
ట్రాఫిక్ పరిధి: 54
వెస్ట్ జోన్ పరిధి: 23
ఈస్ట్ జోన్ పరిధి: 18
సెంట్రల్ జోన్ పరిధి: 18
News November 25, 2025
మాట మార్చిన కడియం..!

స్టే.ఘనపూర్ MLA కడియం శ్రీహరి రోజుకో ట్విస్టు ఇస్తున్నారు. ఒకసారి తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. BRS నుంచి గెలిచిన కడియం, అనూహ్యంగా MP ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్‌కు అనుబంధంగా కొనసాగుతున్నారు.అయితే స్పీకర్‌ను కలిసిన అనంతరం కడియం వైఖరిలో మార్పు వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్దమంటూ కుండబద్దలు కొట్టిన కడియం, ఇప్పుడు రాజీనామా చేసేదీ లేదని చెప్పడం వెనుక మర్మమేంటో కామెంట్ చేయండి.


