News April 16, 2024
మేం చేసిన అభివృద్ధి ఇదే: సీఎం జగన్

AP: తాము 58 నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పారు. ‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశాం. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 11 వేల ఆర్బీకేలు, 3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మించాం. నాడు నేడుతో స్కూళ్లు, హాస్పిటళ్ల రూపురేఖలు మార్చాం’ అని తెలిపారు.
Similar News
News January 30, 2026
బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్?

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి అమలు చేయాలనే ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖలు చర్చలు జరుపుతున్నాయి. దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆరేళ్ల తర్వాత వృద్ధులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేయనున్నారు. గతంలో పురుషులకు 40%, మహిళలకు 50% రాయితీ ఉండేది.
News January 30, 2026
పచ్చి ఆకు ఎరువు అంటే ఏమిటి? దీని వల్ల లాభమేంటి?

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు
News January 30, 2026
IT సోదాలు.. రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య!

బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య చేసుకున్నారు. CONFIDENT కంపెనీ ఫౌండర్, ఛైర్మన్ CJ రాయ్ తన లైసెన్స్‌డ్ తుపాకీతో తనను తాను కాల్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదాయ పన్ను శాఖ రెయిడ్స్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఇటీవల పదే పదే ఐటీ సోదాలు జరుగుతుండటంతో రాయ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


