News April 16, 2024
ఇండియాకు చేరుకున్న ‘అకాయ్’

క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఇండియాకు చేరుకున్నారు. రెండో సంతానం కోసం లండన్ వెళ్లిన ఆమె ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్‌కి జన్మనిచ్చారు. సుమారు మూడు నెలలపాటు అక్కడే గడిపిన ఆమె ఇవాళ ముంబైకి చేరుకున్నారు. అనుష్క కుమారుడు అకాయ్‌ని బేబీ క్యారీ బ్యాగ్‌లో ఎత్తుకుని ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ కోసం విరాట్ కోహ్లీ నెల క్రితమే ఇండియాకు చేరుకున్న విషయం తెలిసిందే.
Similar News
News February 3, 2026
MHBD: ఎత్తయిన శిఖరం ఎక్కి.. త్రివర్ణ పతాకం ఎగరేసి..!

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండాకు చెందిన భూక్యా రామ్మూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు యశ్వంత్ ఆంధ్రప్రదేశ్‌లోని 1,680 మీటర్ల ఎత్తు గల అర్మాకొండ (జింధగడ శిఖరం) పర్వతాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న ఎత్తయిన శిఖరాలతోపాటు ఏడు ఖండాల్లో ఉన్న ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యం అంకితభావంతో ఉన్నానని యశ్వంత్ తెలిపారు.
News February 3, 2026
మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్ ప్యాకెట్ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.
News February 3, 2026
ఇండియాలో ఫార్ములా వన్ రీఎంట్రీ!

ఇండియాలోకి ఫార్ములా వన్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్రం, ఫార్ములా వన్ యాజమాన్యం మధ్య ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు క్రీడా శాఖ వెల్లడించింది. 2011లో నోయిడా సర్క్యూట్‌లో దేశంలోనే తొలిసారి F1కార్లు పరుగులు తీశాయి. 2013లో చివరి సారిగా రేసు జరిగింది. భారీ పన్నులు, ఇతర సమస్యలతో ఇండియాకు F1 దూరమైంది. 2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు జరిగిన విషయం తెలిసిందే.


