News April 16, 2024
తృణమూల్ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తోంది: పీఎం మోదీ

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తోందని పీఎం మోదీ ఆరోపించారు. అక్కడి దక్షిణ దీనాజ్‌పూర్ జిల్లాలో జరిగిన సభలో ఆయన ఈమేరకు ప్రసంగించారు. ‘బెంగాల్‌ను గూండాలకు, అక్రమ వలసదారులకు తృణమూల్ లీజుకిచ్చేసింది. శ్రీరామనవమి వేడుకల్ని కూడా చేసుకోనివ్వని పార్టీగా మారింది. అవినీతి, నేరాలు పతాకస్థాయికి చేరాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలపైనా దాడికి పాల్పడుతున్నారు’ అని మోదీ ఆరోపించారు.
Similar News
News January 26, 2026
భారతీయత ఉట్టిపడేలా ఉర్సులా జాకెట్

భారత సంప్రదాయం ఉట్టిపడేలా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ప్యాంటుసూట్స్‌లో కనిపించే ఆమె తాజాగా బనారసీ జాకెట్‌ను ధరించారు. గోల్డ్, మెరూన్ రంగులో ఉన్న ఈ దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం అని ట్వీట్ చేశారు.
News January 26, 2026
మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్..! ఆమె సేఫేనా?

AP: కర్నూలులో ఈనెల 9న నర్సు HIV ఇంజెక్షన్ ఇచ్చిన లేడీ డాక్టర్‌కు వైరస్ సోకే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలిపారు. వసుంధర గతనెల 28న వైరస్ బ్లడ్ సేకరించి ఫ్రిజ్‌లో ఉంచడంతో అన్ని రోజులు వైరస్ బతకదన్నారు. కానీ రక్త గ్రూప్ తదితరాలతో ముప్పుపై అప్రమత్తత అవసరమని చెప్పారు. వసుంధర ప్రేమించిన డాక్టర్ మరో డాక్టర్‌ను పెళ్లి చేసుకోగా, అతడిని సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించి ఇంజెక్షన్ ఇవ్వడం తెలిసిందే.
News January 26, 2026
20 నిమిషాలకో ఇండియన్ అరెస్ట్

భవిష్యత్తు ఆశతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయులు అధికంగా పట్టుబడుతున్నారు. ఆ దేశ సరిహద్దుల్లో 2025లో ప్రతి 20 నిమిషాలకో ఇండియన్ అరెస్టయ్యారు. గత ఏడాది 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది వివిధ దేశాలకు చెందిన 3.91L మంది అరెస్టయ్యారు. కెనడా, మెక్సికో సరిహద్దుల్లో ఎక్కువ మంది పట్టుబడుతున్నారు.


