News November 25, 2025
పార్వతీపురంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం వన్ స్టాప్ సెంటర్ ఆవరణలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలన్నారు. అలాగే గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
PDPL: భవన కార్మిక సంక్షేమంపై జేఏసీ ఆందోళన

PDPLలో భవన నిర్మాణ కార్మిక సంఘాల JAC ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సీఎస్సీ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, జీవో 12 సవరించి సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కాకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు నిధులను అక్రమంగా బీమా కంపెనీలకు బదిలీ చేశారంటూ నేతలు తీవ్రంగా స్పందించారు. 13లక్షల రెన్యువల్ కాని కార్మికుల కార్డులను వెంటనే పునరుద్ధరించాన్నారు.
News November 25, 2025
వరంగల్: అడ్డాలు తెచ్చిన తంటా..!

అదృష్టం వరించిందని సంతోషపడాలో, అడ్డా దొరకలేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో మద్యం షాపుల ఓనర్లు ఉన్నారు. వరంగల్‌లో లిక్కర్ మార్ట్‌లను దక్కించుకున్న కొత్త వాళ్లకు, పాత షాపుల ఓనర్లు చుక్కలు చూపిస్తున్నారట. HNKలో లిక్కర్ వ్యాపారి తనకు వాటా ఇస్తేనే ఇంటి ఓనర్ నుంచి షాపు రెంట్‌కు ఇప్పిస్తా అనడంతో చేసేదేంలేక తనకు వచ్చిన 2 కొత్త షాపుల్లో వాటా ఇచ్చారట. అన్ని చోట్ల కొత్తవాళ్లకు ఇలా సవాలు ఎదురవుతోంది.
News November 25, 2025
జగిత్యాల: మాతా, శిశు సంరక్షణపై ‘సంకల్ప్’ శిక్షణ

జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాతా–శిశు సంరక్షణ, నవజాత శిశువుల సంరక్షణపై సంకల్ప్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి డా. ప్రమోద్ కుమార్, జీహెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, గైనక్ హెచ్ఓడీ డా. అరుణ, పిల్లల నిపుణుడు డా. సాయి కిరణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటును 24 నుంచి 10 లోపు తగ్గించేందుకు ఆశా వర్కర్ల ద్వారా అవగాహన పెంపు అవసరమన్నారు.


