News April 16, 2024

వాహన తనిఖీలు.. రూ.6 లక్షలు సీజ్: ఆర్డీవో

image

పెద్దాపురం మెయిన్ రోడ్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.6 లక్షల నగదు పట్టుబడినట్లు ఆర్డీవో సీతారామారావు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెంకట రాజగుప్తా పెద్దాపురం మెయిన్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. కాండ్రకోటకు చెందిన పల్లికల శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి వద్ద ఎటువంటి పత్రాలు లేకుండా రూ.6లక్షల నగదు పట్టుబడిందని అన్నారు.

Similar News

News October 8, 2025

రాజమండ్రిలో హౌస్ బోట్లు

image

రాజమండ్రిలో టూరిస్టుల కోసం త్వరలో హౌస్‌ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. రూ. 94 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా మూడు హౌస్‌ బోట్లు, నాలుగు జల క్రీడల బోట్లు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని కొవ్వూరు గోష్పాద క్షేత్రం, పుష్కర్ ఘాట్, సరస్వతీ ఘాట్‌లలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని జిల్లా టూరిస్ట్ ఆఫీసర్ వెంకటాచలం తెలిపారు.

News October 7, 2025

ఈనెల 8 నుంచి సదరం శిబిరాలు: కలెక్టర్

image

జిల్లాలో అప్పీలు చేసుకొన్న దివ్యాంగుల పెన్షన్ల అంచనాకు మళ్లీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సదరం శిబిరాలను ఈ నెల 8 నుంచి GGH, రాజమండ్రి, అనపర్తి ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. తక్కువ శాతం దివ్యాంగత్వం ఉండి, పెన్షన్ పొందడానికి అర్హత లేని వారిగా గతంలో నోటీసులు అందుకొన్న వారికి పునఃపరిశీలన చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు.

News October 7, 2025

రాజనగరం: బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

image

రాజానగరం మండలం నందరాడ సమీపంలో మంగళవారం రాత్రి 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కోరుకొండ నుంచి స్కూటీపై వస్తున్న రాజానగరానికి చెందిన బుద్ధిరెడ్డి సత్యనారాయణ (36), కొవ్వూరు నుంచి బైకుపై కోరుకొండ వెళ్తున్న మెర్ల శ్రీనివాసరావు (45) ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ప్రియ కుమార్ తెలిపారు.