News April 16, 2024

CM రేవంత్‌కు ఈసీ ఝలక్

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. భద్రాచలంలోని శ్రీసీతారాములవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి రేవంత్‌కు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇది సాధ్యం కాదని పేర్కొంది. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. దీంతో ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు.

Similar News

News November 18, 2024

BGTలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన యాక్టివ్ ప్లేయర్లలో పుజారా టాప్‌లో ఉన్నారు. 24 టెస్టులు ఆడిన ఆయన 2,033 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (24 టెస్టులు, 1979 రన్స్), స్టీవ్ స్మిత్ (18 T, 1887 R), రహానే (17 T, 1090 R), లబుషేన్ (9 T, 708 R) ఉన్నారు. కాగా పుజారా, రహానే ఈనెల 22 నుంచి జరగనున్న సిరీస్‌కు ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే.

News November 18, 2024

OTTలోకి వచ్చేసిన నయనతార డాక్యుమెంటరీ

image

నయనతార కెరీర్, ప్రేమ, పెళ్లిపై ‘నెట్‌ఫ్లిక్స్’ రూపొందించిన డాక్యుమెంటరీ విడుదలైంది. హిందీ, తెలుగు, ఇంగ్లిష్, తమిళ భాషల్లో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ‘నానుం రౌడీదాన్’ మూవీకి సంబంధించిన ఫుటేజ్ వాడుకోవడంపై <<14626837>>నయన్‌, హీరో ధనుష్ మధ్య వివాదం<<>> తలెత్తిన సంగతి తెలిసిందే.

News November 18, 2024

వినూత్నం: చెక్కతో చేసిన ఉపగ్రహం

image

ప్రపంచంలో చెక్కతో తయారుచేసిన మొట్ట మొదటి ఉపగ్రహం ‘లిగ్నోశాట్’ను ఈనెల 5న అంతరిక్షంలోకి పంపారు. క్యోటో యూనివర్సిటీ & సుమిటోమో ఫారెస్ట్రీ పరిశోధకులు దీనిని అభివృద్ధి చేశారు. ఈ వినూత్న ఉపగ్రహం స్పేస్‌ఎక్స్ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. భవిష్యత్తులో మూన్ & మార్స్‌పై అన్వేషణ కోసం కలపను పునరుత్పాదక పదార్థంగా ఉపయోగించవచ్చో లేదో పరీక్షించడం ఈ మిషన్ ఉద్ధేశ్యం.