News April 16, 2024
VKBD: జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతి

వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా ఉమా హారతిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా ఉమా హారతి, IAS, 2022-23 వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిపాలనపై పట్టు సాధించి భవిష్యత్తులో ప్రజలకు ఉన్నత సేవలు అందించి మంచి పేరు సంపాదించేలా కృషి చేస్తానని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి అన్నారు.
Similar News
News September 11, 2025
సీఎం చేతుల మీదుగా మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ ప్రారంభిస్తాం: మేయర్

బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్ బస్తీలో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె ఖైరతాబాద్ ZC అనురాగ్ జయంతితో కలిసి ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
News September 11, 2025
HYD: మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

వర్షాకాలం వరద పోయేందుకు వీలుగా మ్యాన్‌హోళ్ల మూతలు తెరవడం, వరద తగ్గగానే వాటి తిరిగి మూసేస్తున్నట్లు హైడ్రా తెలిపింది. మూత తెరిచి ఉన్న దగ్గర సిబ్బంది ఉండేలా చూస్తామని, ఒక వేళ ఎక్కడైనా పొరపాటున మ్యాన్‌హోల్ మూత తెరచి ఉంటే 9000113667 నంబరుకు కాల్ చేసి తెలియజేయాలని హైడ్రా కోరింది.
News September 11, 2025
29వ తేదీలోగా అన్ని పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల ఇంటర్నల్ పరీక్షలను ఈ నెల 29వ తేదీలోగా నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని సూచించారు. ఈ నెల 29వ తేదీలోగా మార్కుల జాబితాను వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.